మాతెలుగు తల్లికి మల్లెపూదండ. అమెరికన్ తెలుగు అసోసియేషన్ రజతోత్సవ వేడుకలు జూలై 1,2,3 తేదీలలో చికాగో నగరంలో జరగబోతున్నాయి. మరో సారి తెలుగు తల్లికి నీరజనాలు ఇచ్చి తెలుగు జాతి సంప్రదాయాన్ని, విశిష్టతను, మాతృభాషను, మమకారాన్ని నాలుగు చెరగులా ప్రకాశింప చేసే భాగ్యం కలగడం చికాగో తెలుగు వారి అదృష్టం.
రంగుల హరివిల్లును మరిపించే అలంకారాలు, అందాలతోరాజిల్లే షాపింగ్ ఏరియా, యువతరాని యూజ్ ఫుల్ ఐటీ పార్కు, జాబ్ ఫేర్ - కాదేదీ కాన్ఫరెన్సు కు అనర్హం.
సాహిత్య, సంగీత, రాజకీయ, యోగ, మెడిటేషన్, స్పిరుచ్వల్, హెల్తండ్ యూత్ - సోదరా ఏది నీ కోరిక. సోదరీ ఏది నీ దారి .14 పైన గదులలో విజ్ఞానము వికాసం, ఆరోగ్యం, వేదాంతం. అందరూ ఆహ్వానితులే. రంగు రంగుల హరివిల్లుల అందాలతో అలంకరించబడిన హాలు. అమ్మ చేతి రుచిని మరిపించే విందు భోజనం, అల్పాహారాలు. అనుకోని పరిచయాలు. ఆషామాషి కబుర్లు.
కూచిపూడి కులుకు, కృష్ణవేణి లయలు, మైకల్ జాక్సన్ మెరుపులూ. వివిధ రంగాలలో నిష్ణాతులైన కళాకారుల ప్రదర్శనలు. సాహిత్య, సామాజిక, సినీ, రాజకీయ రంగాల ప్రముఖులతో మన మెయిన్ స్టేజి ప్రకాశించుతుంది. పాల్గొనండి. ప్రతిభా పాటవాలు ప్రదర్శించండి. అవధరించండి. అనందించండి. తెలుగు తల్లి సేవకు మీ ఆర్ధిక చేయూతనివ్వండి. తెలుగువారందరూ తరలి రండి. ఆటా సంస్థను మరో మెట్టు పైన కూర్చోబెట్టి తెలుగు తల్లి మెడలో ముత్యాల హారం అలంకరించే సమయం ఇది.